Mancherial District: యువతిని మభ్యపెట్టి మోసం... ఇంటి ముందు దీక్ష!

  • మంచిర్యాల సమీపంలో ఘటన
  • ప్రేమిస్తున్నానని వెంటపడి మోసం
  • ప్రియుడి ఇంటి ముందు నిరసనలకు దిగిన యువతి
ఎన్నడో చనిపోయిన తండ్రి, అనారోగ్యంతో ఉన్న తల్లి, ఇంకా చదువు పూర్తి చేసుకోని చెల్లి... ఆ ఇంటికి అన్నీ తానై నడిపించుకుంటూ వస్తుంటే, ప్రేమిస్తున్నానని వెంటపడి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన ఓ యువకుడు, ఇప్పుడు మోసం చేశాడని ఆరోపిస్తూ, నిరసనలకు దిగిందో యువతి.

మరిన్ని వివరాల్లోకి వెళితే, మంచిర్యాల, శ్రీరాంపూర్ కు చెందిన ఈద సంధ్యారాణి, అదే ప్రాంతానికి చెందిన దాట్ల రోహిత్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తొలుత వివాహం చేసుకుంటానని నమ్మబలికిన రోహిత్, ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోవడం లేదంటూ నిరాకరిస్తున్నాడు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన ఆమె, ప్రియుడి ఇంటి ముందు దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకూ దీక్షను కొనసాగిస్తానని ఆమె అంటుండగా, మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.
Mancherial District
Sri Rampur
Lover
Protest
Love

More Telugu News