Balakrishna: మీకు సంబరంతో కూడిన ఆశ్చర్యం... నిజమేనా బాలయ్యా?: విజయసాయిరెడ్డి సెటైర్

  • కూకట్ పల్లి నుంచి టీడీపీ తరఫున సుహాసిని
  • నామినేషన్ కార్యక్రమం తరువాత నోరు జారిన బాలయ్య
  • ట్విట్టర్ వేదికగా విమర్శించిన విజయసాయిరెడ్డి
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి తరఫున కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థినిగా బరిలోకి దిగిన దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, నామినేషన్ వేసే సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

మీడియాతో మాట్లాడుతున్న వేళ, బాలకృష్ణ నోరుజారి, నందమూరి హరికృష్ణ మృతితో సంభ్రమాశ్చర్యాలు కలిగాయని అనగా, ట్విట్టర్ వేదికగా, విజయసాయి ఓ ట్వీట్ పెట్టారు. "మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరంతో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును, తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా. కుటుంబ సభ్యులు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావా బాలయ్యా?" అని ప్రశ్నించారు.



Balakrishna
Nandamuri
Harikrishna
Suhasini
Vijayasai Reddy

More Telugu News