Roja: చంద్రబాబుపై రోజా భర్త, దర్శకుడు సెల్వమణి సంచలన వ్యాఖ్యలు!

  • కాంగ్రెస్ తో కలసి పనిచేస్తారా
  • నాటి చంద్రబాబుకు, నేటి చంద్రబాబుకు ఎంతో తేదా
  • నమ్మక ద్రోహిగా మారిన బాబు: సెల్వమణి
సిగ్గు శరం లేని చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి పనిచేసేందుకు సిద్ధపడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మహిళా నేత రోజా భర్త సెల్వమణి సంచలన విమర్శలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన, నగరిలో నిర్వహించిన ఓ సభలో చంద్రబాబుపై తొలిసారి విమర్శలు గుప్పించడం గమనార్హం. తనకు గతంలో తెలిసిన చంద్రబాబుకు, ఇప్పుడు చూస్తున్న చంద్రబాబుకు ఎంతో తేడా ఉందని, ఆయన నమ్మక ద్రోహని అన్నారు. 14 సంవత్సరాల క్రితం తనకు చంద్రబాబంటే అభిమానం ఉండేదని, 2014లో ఆయన నిజ స్వరూపం చూసి, అప్పటి నుంచి అసహ్యించుకుంటున్నానని అన్నారు. వైకాపా తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు సర్కారు నరకం చూపిస్తోందని సెల్వమణి ఆరోపించారు.
Roja
Selvamani
Chandrababu
YSRCP

More Telugu News