చిన్నప్పటి నుంచి పెంచిన మావటిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టిన ఏనుగు!

  • జార్ఖండ్ జూలో విషాదం
  • మేతపెడుతున్న సమయంలో ఘటన
  • మరో ఇద్దరు సిబ్బందిని పరుగులు పెట్టించిన ఏనుగు
జార్ఖండ్‌లోని బిస్రాముండా జూలో ఓ మావటిని ఏనుగు నేలకేసి కొట్టి చంపింది. పోలీసులు, జూ సిబ్బంది కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన మహేంద్రసింగ్ (56) జూపార్క్‌లో మావటిగా పనిచేస్తున్నాడు. రోజులానే జూలోని రాము అనే ఏనుగుకు మేత వేసేందుకు వెళ్లాడు. అతడితోపాటు జూపార్క్ సిబ్బంది చున్నీలాల్, బైజ్నాథ్ ఉన్నారు. అయితే, ఏమైందో ఏమోకానీ ఏనుగు ఒక్కసారిగా చున్నీలాల్, బైజ్నాథ్‌పై దాడి చేసింది. వారిని పరిగెత్తించింది. అతి కష్టం మీద వారు ఏనుగు నుంచి తప్పించుకున్నారు.

అయితే, ఏనుగుపై కూర్చున్న మావటి మహేంద్రసింగ్‌ను తొండంతో కిందికి లాగి పడేసింది. అనంతరం అతడిని తొండంతో చుట్టి నేలకేసి కొట్టింది. తీవ్రంగా గాయపడిన మహేంద్రసింగ్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తనను కొట్టిచంపిన రాము(ఏనుగు)ను మహేంద్రసింగ్ చిన్నప్పటి నుంచి పెంచుతుండడం గమనార్హం.
Go Back to Shorts
jarkhand
Elephant
zoo
mahout
Birsa Munda

More Telugu News