Ileana: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఇలియానాకు బాలీవుడ్ లో భారీ ఆఫర్
  • కమల్ సినిమాలో వెన్నెల కిశోర్
  • మళ్లీ వస్తున్న కథానాయిక సంగీత 
*  తాజాగా విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రంలో నటించిన కథానాయిక ఇలియానాను ఆ సినిమా తీవ్రంగా నిరాశపరచింది. అయితే, ఇదే సమయంలో అమ్మడికి బాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చింది. జాన్ అబ్రహాం హీరోగా అనీస్ బజ్మీ రూపొందిస్తున్న 'పాగల్ పంటి' చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ఆమెకు వచ్చింది.
*  కమలహాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'భారతీయుడు 2'లో తెలుగు హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఓ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
*  గతంలో పలు చిత్రాలలో కథానాయికగా నటించిన సంగీత ఎనిమిదేళ్ల విరామం అనంతరం మళ్లీ టాలీవుడ్ కి వచ్చింది. శ్రీకాంత్ హీరోగా రూపొందుతున్న 'తెలంగాణ దేవుడు' చిత్రంలో సంగీత కథానాయికగా నటించింది.
Ileana
Kamal Haasan
shankar
kishor
sangeetha

More Telugu News