Vijayawada: ఫార్ములా వన్ హెచ్2 వో బోట్ రేసింగ్ విజేత అబుదాబి

  • ముగిసిన ఫార్ములా వన్ హెచ్ 2వో బోట్ రేసింగ్
  • అబుదాబి టీమ్ డ్రైవర్ షాన్ టొరాంటో విజేత
  • రెండో స్థానంలో ఎమిరేట్స్ టీమ్ మహిళా డ్రైవర్ స్ట్రోమా
విజయవాడలో జరిగిన ఫార్ములా వన్ హెచ్ 2వో బోట్ రేసింగ్ ఫైనల్స్ విజేతగా అబుదాబి నిలిచింది. తుది పోటీల్లో అబుదాబి టీమ్ డ్రైవర్ షాన్ టొరాంటో విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో ఎమిరేట్స్ టీమ్ మహిళా డ్రైవర్ స్ట్రోమా మారియట్, మూడో స్థానంలో ఎరిక్ స్టార్క్ నిలిచారు. ఈ పోటీల్లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన అమరావతి బోట్ డ్రైవర్ అండర్సన్ మధ్యలోనే పోటీ నుంచి వైదొలగడం గమనార్హం. ప్రకాశం బ్యారేజ్ లో మూడు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 9 జట్లకు చెందిన 19 బోట్లు బరిలోకి దిగాయి.  
Vijayawada
formula one
boat racing
abudabi

More Telugu News