RRR: 'RRR' సంచలనం... 'బాహుబలి'కి సాధ్యం కాని రికార్డు!

  • రూ. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్!
  • రూ. 200 కోట్లకు శాటిలైట్ రైట్స్
  • ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న 'RRR' గురించిన ఓ సంచలన వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందే 'బాహుబలి' రికార్డును దాటేస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 600 కోట్ల వరకూ ఉండనుందట. థియేటరికల్ రైట్స్ రూ. 400 కోట్ల వరకూ, శాటిలైట్ రైట్స్ రూ. 200 కోట్ల వరకూ పలకనున్నాయని టాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 'బాహుబలి' తొలి భాగం విడుదలైన తరువాత రెండో భాగం కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదన్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ను వేసి, హీరోలు, దర్శకుడు అక్కడే మకాం వేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
RRR
Rajamouli
Ramcharan
NTR
Pre Release Business

More Telugu News