Rajashekhar: షూటింగులో గాయపడ్డ హీరో రాజశేఖర్!

  • రాజశేఖర్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న 'కల్కి'
  • డూప్ లేకుండా నటించిన రాజశేఖర్
  • భుజానికి గాయంతో ఆసుపత్రికి

నిర్మాత సీ కల్యాణ్ తో కలసి రాజశేఖర్ స్వయంగా నిర్మిస్తున్న 'కల్కి' చిత్రం షూటింగ్ లో హీరో రాజశేఖర్ గాయపడ్డారు. 1983 బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియడ్ చిత్రంగా, థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుండగా, దాదాపు 2 కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో భారీ సెట్ వేసి, యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది.

 సినిమా యూనిట్ వారిస్తున్నా వినకుండా రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేయాలని రాజశేఖర్ నిర్ణయించారని ఈ క్రమంలో ఆయన భుజానికి గాయం అయిందని తెలుస్తోంది. గాయాన్ని లెక్క చేయని రాజశేఖర్ షూటింగ్ ను పూర్తి చేసి, ఆపై ఆసుపత్రికి వెళ్లారట. కాగా, ఈ చిత్రంలో ఆదా శర్మ, నందిత శ్వేత, స్కార్ లెట్ విల్సన్ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News