keerti suresh: డీ గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధం: కీర్తి సురేశ్

  • తెలుగు .. తమిళ భాషల్లో క్రేజ్
  • అగ్రహీరోల సరసన అవకాశాలు  
  • వరుసగా పలకరిస్తోన్న విజయాలు    
తెలుగు .. తమిళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ వుంది. అందం .. అభినయంతో పాటు ఈ సుందరికి అదృష్టం కూడా ఎక్కువే. అందువల్లనే అగ్రహీరోల సరసన అవకాశాలు .. ఆ వెంటనే విజయాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది కీర్తి సురేశ్ కి బాగా కలిసొచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో ఎడా పెడా సక్సెస్ లను సొంతం చేసుకుంది.

గ్లామర్ పరంగా కుర్రకారు మనసులు దోచేసిన ఈ బొద్దుగుమ్మ, డీ గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమని చెబుతోంది. బలమైన కథాకథనాలు .. పాత్రకి ప్రాధాన్యత ఉండాలిగానీ, డీ గ్లామర్ గా కనిపించడానికి తాను రెడీగా వున్నానని చెప్పింది. అలాంటి పాత్రలతో దర్శక నిర్మాతలు రావొచ్చునని అంది. ఇతర భాషల్లో సంగతేమోగానీ, తెలుగులో ఆమె ముచ్చట తీరడం కష్టమేనని చెప్పాలి.   
keerti suresh

More Telugu News