Revanth Reddy: నవ్వులు చిందిస్తున్న చంద్రబాబు.. ఆకట్టుకుంటున్న రేవంత్ పోస్టర్!

  • ప్రచారాన్ని ముమ్మరం చేసిన రేవంత్
  • పోస్టర్లపై సోనియా, రాహుల్, చంద్రబాబు, కోదండరామ్
  • ఒకే పోస్టర్ పై కాంగ్రెస్, టీడీపీ నేతలు
కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల కలయికతో మహాకూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన పోస్టర్లు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనకున్న గౌరవాన్ని రేవంత్ తన పోస్టర్ల ద్వారా తెలియజేశారు.

పోస్టర్ పై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కోదండరామ్ లతో పాటు నవ్వులు చిందిస్తున్న చంద్రబాబు ఫొటోను కూడా ఉంచారు. ఈ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఒకే పోస్టర్ పై కనిపిస్తుండటంపై జనాలు చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొన్ని చోట్ల కూటమి నేతలంతా కలసి, మరి కొన్ని చోట్ల విడివిడిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Revanth Reddy
Chandrababu
Sonia Gandhi
Rahul Gandhi
poster
congress

More Telugu News