Andhra Pradesh: చంద్రబాబు భయపడుతున్నారు.. అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశారు!: కేంద్ర మంత్రి జైట్లీ

  • తీవ్రమైన తప్పులు చేసినవారే భయపడుతున్నారు
  • సీబీఐని విచారించకుండా అడ్డుకుంటున్నారు
  • అవినీతిపై రాష్ట్రాలకు సార్వభౌమత్వం ఉండదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయమై స్పందించారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో జైట్లీ మాట్లాడారు.

శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే ఉన్నప్పటికీ అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఏదో జరుగుతుందన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడంలో భాగంగానే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐ విచారణ చేపట్టకుండా సమ్మతిని రద్దు చేస్తున్నాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.

More Telugu News