allu arjun: అల్లు అర్జున్ కి ఆ కథ బాగా నచ్చేసిందట!

  • తమిళంలో హిట్ కొట్టిన '96'
  • దిల్ రాజు చేతికి తెలుగు రైట్స్ 
  • ఈ కథపై ఆసక్తి చూపుతోన్న బన్నీ

అల్లు అర్జున్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తో వుండనుందని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన పనుల్లోనే త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే '96' తమిళ మూవీ రీమేక్ లో చేయాలనే నిర్ణయానికి అల్లు అర్జున్ వచ్చాడనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా తెరకెక్కిన '96' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ ఏడాది వచ్చిన వైవిధ్యభరితమైన చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ కారణంగానే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ .. తనకి బాగా నచ్చేసిందని అన్నాడట. తెలుగు రీమేక్ లో చేయాలనే ఆసక్తిని చూపినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తరువాత సినిమాగా ఆయన ఈ రీమేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.  

More Telugu News