alok varma: నిజాయతీ పరుడైన అలోక్ వర్మకు అన్యాయం జరిగింది: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి

  • ఢిల్లీలో సీపీగా ఉన్నప్పటి నుంచి అలోక్ నాకు తెలుసు
  • అవినీతి వ్యతిరేక ప్రచారానికి విఘాతం కలిగింది
  • ‘సుప్రీం’ ఆయనకు న్యాయం చేస్తుందన్న నమ్మకముంది  
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోమారు మద్దతుగా నిలిచారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి అలోక్ వర్మ తనకు తెలుసని, ఎంతో నిజాయతీ పరుడైన ఆయనకు అన్యాయం జరిగిందని అన్నారు.

తాము చేపట్టిన అవినీతి వ్యతిరేక ప్రచారానికి విఘాతం కలిగిందని, సుప్రీంకోర్టు ఆయనకు న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అలోక్ వర్మకు సుబ్రహ్మణ్యస్వామి బాసటగా నిలవడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ అలోక్ వర్మ నిజాయతీ గురించి ఆయన ప్రస్తావించారు.
alok varma
cbi
bjp
subramanya swamy

More Telugu News