Andhra Pradesh: కూకట్ పల్లిలో రెబెల్ అభ్యర్థిని నిలబెడతాం.. నందమూరి సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం!: స్థానిక కాంగ్రెస్ నేతల వార్నింగ్

  • స్థానికులకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
  • చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
  • వాటిని ఆంధ్రాలో చేసుకోవాలని హితవు
ప్రజాకూటమి(మహాకూటమి) పొత్తుల్లో భాగంగా కూకట్ పల్లి స్థానాన్ని నటుడు దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై మిత్రపక్షాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలుత ఈ స్థానాన్ని టీడీపీ నేత పెద్దిరెడ్డికి కేటాయిస్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి టికెట్ ను స్థానికులకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఆందోళనకు దిగారు.

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్‌ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెబెల్ అభ్యర్థిని నిలబెడతామనీ, సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. కుల రాజకీయాలను చంద్రబాబు ఆంధ్రాలో చేసుకుంటే మంచిదనీ, తెలంగాణలో మానుకోవాలని హితవు పలికారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
Congress
KUKATPALLI
nandamuri suhasini

More Telugu News