vijay: మళ్లీ వచ్చే దీపావళిపై దృష్టి పెట్టిన విజయ్

  • అట్లీ కుమార్ తో విజయ్ 
  • గతంలో వచ్చిన 'మెర్సల్' హిట్ 
  • నాయికలుగా సమంత .. నయన్

విజయ్ హీరోగా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సర్కార్' .. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ వసూళ్ల మోత మోగిస్తోంది. కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ ను అభిమానులు ఎంజాయ్ చేస్తుండగానే, విజయ్ తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా 'అట్లీ కుమార్' దర్శకత్వంలో రూపొందనుంది.

ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ కి ఇది 63వ సినిమా .. క్రీడా నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'మెర్సల్' 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అందువలన ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరుగుతున్నాయి. కథానాయికలుగా సమంత .. నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చనున్న ఈ సినిమాను, వచ్చే దీపావళికి విడుదల చేయనున్నారు.  

More Telugu News