trivikram: బుల్లితెరపై కూడా నిరాశ పరిచిన 'అజ్ఞాతవాసి'

  • బుల్లితెరపై త్రివిక్రమ్ సినిమాలకి క్రేజ్ 
  • దీపావళి సందర్భంగా వచ్చిన 'అజ్ఞాతవాసి'
  • ఆశించిన స్థాయిలో రాని రేటింగ్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' తరువాత త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావించారు. కానీ వాళ్లను ఈ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది.

బుల్లితెరపై త్రివిక్రమ్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఆయన సినిమాలు మంచి రేటింగ్ ను రాబడుతుంటాయి. అందువలన జెమినీ టీవీ వారు 19.5 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఈ దీపావళి కానుకగా ఈ సినిమాను మొదటిసారి ప్రసారం చేశారు. ఈ సినిమా భారీ రేటింగ్ తీసుకొస్తుందని భావించారు. కానీ ఈ సినిమాకి 5.3 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. ఇలా జరగడం ఆ ఛానల్ వారికి పూర్తి నిరాశను కలిగించినట్టుగా తెలుస్తోంది.  

More Telugu News