KCR: కేసీఆర్ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ రాజీనామా

  • కేసీఆర్‌తోపాటే ఎన్నికల సభల్లోకి
  • ఎన్నికల నిబంధనల ప్రకారం నేరం
  • అందుకే రాజీనామా

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వద్ద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా విధులు నిర్వర్తిస్తున్న దేశపతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్‌తోపాటు తాను కూడా ఎన్నికల సభల్లో పాల్గొనాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీనివాస్ తెలిపారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ పదవిలో ఉండే వ్యక్తులు ఎన్నికల సభల్లో, ప్రచారంలో పాల్గొనడానికి వీలుకాదు. ఈ కారణంగానే తాను రాజీనామా చేసినట్టు దేశపతి తెలిపారు. రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి పంపానని పేర్కొన్నారు. కాగా, దేశపతి శ్రీనివాస్ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

More Telugu News