Chandrababu: దేశాన్ని కాపాడుకోవాలనే పార్టీలను ఏకం చేస్తున్నా: చంద్రబాబు

  • నేనెవరికీ భయపడను
  • బీజేపీ నమ్మించి మోసం చేసింది
  • పెట్రోల్, నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి
దేశాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జాతీయస్థాయిలో పార్టీలను ఏకం చేస్తున్నానని.. తాను ఎవరికీ భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ తెలిపిందన్నారు. బీజేపీ చేసిన నోట్ల రద్దు కారణంగా తీవ్ర సమస్యలొచ్చాయని.. రూపాయి పడిపోయిందని చంద్రబాబు అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, నిత్యావసర ధరలు భారీగా పెరిగాయన్నారు. ఏమైనా అంటే సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
Chandrababu
BJP
National
Congress

More Telugu News