Jagan: కాకినాడ ఎస్‌ఈజెడ్‌పై చంద్రబాబు, జగన్ ఎందుకు స్పందించట్లేదు?: పవన్

  • ఒక పరిశ్రమ కానీ, ఉద్యోగం కానీ రాలేదు
  • భూములను అడ్డగోలుగా అమ్మారు
  • అధికారులు బాధ్యత వహించాలి
దాదాపు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌కి కాకినాడ ఎస్‌ఈజెడ్ సమస్య కనిపించలేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట ఎస్ఈజడ్ భూములు.. పునరావాస కాలనీలో పవన్‌ పర్యటించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, జగన్‌ ఎస్‌ఈజెడ్ విషయమై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాకినాడ ఎస్ఈజెడ్‌లో ఒక పరిశ్రమగానీ.. లేదంటే ఒక ఉద్యోగం కానీ నేటి వరకూ రాలేదన్నారు. అడ్డగోలు భూ దాహానికి ఇక్కడి అధికారులు బాధ్యత వహించాలన్నారు. కాకినాడలోని భూములను అడ్డగోలుగా కేవీ రావు అనే వ్యక్తి అమ్మి.. అమెరికాలో ద్రాక్ష తోటలు కొనుగోలు చేశారని ఆరోపించారు.
Jagan
Chandrababu
Pawan Kalyan
Kakinada
KV Rao

More Telugu News