జైలు ఊచలైతే జగన్ కు బాగా కనిపిస్తాయి.. ఇలాంటివి కనిపించవు: అయ్యన్నపాత్రుడు
- జగన్ అతి పెద్ద దొంగ
- డయాఫ్రం వాల్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి కూడా సీఎం కావాలనుకుంటున్నారు
- సుజల స్రవంతి ప్రాజెక్టును అడ్డుకుంటే.. సర్వనాశనమైపోతారు
డయాఫ్రం వాల్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి కూడా సీఎం కావాలని కలలు కంటుండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా, జగన్ అడ్డుపడినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. సుజల స్రవంతి ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు యత్నిస్తున్నారని.. ప్రాజెక్టును అడ్డుకుంటే సర్వనాశనమైపోతారని మండిపడ్డారు.