కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నారు.. బండారం బయటపెడతా: వీహెచ్

15-11-2018 Thu 17:12
  • నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలను ఎందుకు ఇవ్వలేకపోయారు?
  • రాఫెల్ కుంభకోణంపై రేపు ధర్నా చేస్తాం
  • ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ధర్నా కొనసాగుతుంది

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. కేటీఆర్ ఎక్కువ మాట్లాడుతున్నారని, ఆయన బండారం బయటపెడతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంపిణీ ఇంకా పూర్తి కాలేదని... ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఆ అంశంపై తాను మాట్లాడనని చెప్పారు.

 నాలుగున్నరేళ్లుగా ఉద్యోగాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై రేపు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ధర్నా కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.