Hyderabad: గెలిస్తే మీరే సీఎం అవుతారా? నిజాయతీగా సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తే... కేటీఆర్ సమాధానం ఇదిగో!

  • హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో కేటీఆర్ సమావేశం
  • మంత్రిని అవుతానని కూడా అనుకోలేదన్న కేటీఆర్
  • మరో 15 ఏళ్లు కేసీఆరే సీఎం అని స్పష్టీకరణ

ఈ మధ్యాహ్నం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్, మీడియాతో సమావేశమైన వేళ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "నా ప్రశ్నకు మీరు నిజాయతీగా సమాధానం చెప్పాలి. అందరు రాజకీయనాయకుల్లా స్మార్ట్ గా ఉండవద్దు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే, మీరు ముఖ్యమంత్రి అవుతారా?" అని ప్రశ్నించారు.

 ఈ ప్రశ్నను రవికాంత్ ఇంగ్లీష్ లో అడుగగా, కేటీఆర్ తాను తెలుగులో సమాధానం ఇస్తానంటూ, తానసలు మంత్రిని అవుతానని కూడా అనుకోలేదని, రాష్ట్రం కోసమే ఉద్యోగాన్ని వదులుకుని ఉద్యమంలోకి వచ్చానని అన్నారు. తాను కేసీఆర్ దయవల్లనే మంత్రిని అయ్యానని, తాను నిజాయతీగా చెబుతున్నానని, ఇంతకన్నా తనకు ఎటువంటి ఆశలు, దురాశలు లేవని అన్నారు. కేసీఆర్ వంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని, అటువంటి నేత ఉంటేనే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

అటువంటి నేత కాకుండా, మరెవరైనా సీఎం కావాలని అనుకుంటే అది వెర్రితనమే అవుతుందని అన్నారు. పొరపాటున కూడా తనకు అటువంటి ఆశ లేదని స్పష్టం చేశారు. కనీసం మరో 15 ఏళ్లు ఆయనే సీఎం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతవరకూ తాను మంత్రిగా ఉన్నా సంతోషమేనని, లేకున్నా బాధపడబోనని అన్నారు.

  • Loading...

More Telugu News