jawa: 22 ఏళ్ల తర్వాత భారత మార్కెట్లోకి మళ్లీ దూసుకొచ్చిన 'జావా' బైక్ లు!

  • 1996లో ఆగిపోయిన జావా అమ్మకాలు
  • చెక్ బ్రాండ్ ను ఇండియాలో తయారు చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా
  • 300సీసీ బైక్ ప్రారంభ ధర రూ. 1.55 లక్షలు

జావా మోటార్ బైక్... ఒకప్పుడు భారత రోడ్లపై దుమ్మురేపింది. అప్పట్లో జావా బైక్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తదనంతర కాలంలో జావా బైక్ ల అమ్మకాలను ఆ సంస్థ నిలిపివేసింది. 1996లో జావా బైక్ ల అమ్మకాలు ఆగిపోయాయి. 22 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మన దేశంలో జావా బైక్ ల సందడి మొదలుకానుంది. ఈరోజు తన కొత్త 300సీసీ మోటార్ సైకిల్ ను జావా మోటార్ సైకిల్స్ ఇండియా లాంచ్ చేసింది. చెక్ బ్రాండ్ అయిన ఈ బైకులను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇండియాలో తయారు చేస్తోంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.55 లక్షలు.  

More Telugu News