nara lokesh: నారా లోకేష్ తెలిసి మాట్లాడుతున్నాడో.. తెలియక మాట్లాడుతున్నాడో!: బైరెడ్డి రాజశేఖరరెడ్డి

  • రాహుల్ ప్రధాని కావడం చంద్రబాబుకు ఇష్టం లేదు
  • ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారని లోకేష్ చెప్పడం సమంజసం కాదు
  • రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే

రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎవరనేది నిర్ణయించేది చంద్రబాబేనని దుబాయ్ లో మంత్రి నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

ఆయన తెలిసి మాట్లాడుతున్నాడో, తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. దేశాలు తిరుగుతూ ఫొటోలకు పోజులివ్వడంలో తప్పులేదని... అనవసర ప్రకటన చేయడం మాత్రం సబబు కాదని చెప్పారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తొలి నుంచి కూడా బీజేపీని ఎండగడుతున్నది కాంగ్రెస్ పార్టీనే అని బైరెడ్డి అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. నాలుగేళ్లుగా బీజేపీతో కాపురం చేసి, ఇప్పుడు బయటకు వచ్చి, ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే ఉంటుందని చెప్పారు. 

More Telugu News