Thugs of Hindusthan: 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' ఓ ఫ్లాప్ సినిమా... నోరు జారిన షారూఖ్!

  • ఇటీవల విడుదలైన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'
  • సినిమా ఫ్లాప్ కావడంతో బాధేసిందన్న షారూఖ్
  • నిర్మాతలకు మింగుడు పడని షారూఖ్ వ్యాఖ్యలు

సాధారణంగా ఏ సినిమా అయినా, థియేటర్లలో అడుతూ ఉంటే, అది ఫ్లాప్ అని పరిశ్రమలోని ఎవరూ అంగీకరించరు. కలెక్షన్లు చూపిస్తూ, ప్రమోషన్ చేస్తూ, మరికాస్త డబ్బు సంపాదించాలనే చూస్తుంటారు. అయితే, ఇటీవల విడుదలైన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' విషయంలో మాత్రం షారూఖ్ ఖాన్ నోరు జారాడు.

ఈ చిత్రం జయాపజయాల మాటెలా ఉన్నా, సినిమా పోయిందని చెప్పేశాడు. షారూఖ్ మీడియాతో మాట్లాడుతున్న వేళ, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రం ప్రస్తావన వచ్చింది. ఆ వెంటనే సినిమా ఫ్లాప్ కావడం తనకు ఎంతో బాధను కలిగించిందని షారూఖ్ అనేశాడు.

ఇదే సమయంలో అమితాబ్, అమీర్ లు బాలీవుడ్ ఇండస్ట్రీకి సేవ చేస్తున్న వారని, సినిమా పోయినంత మాత్రాన వారి ప్రతిభను తక్కువ చేయలేమని అన్నాడు. గతంలో తన 'రావన్' చిత్రానికీ ఇదే పరిస్థితి వచ్చిందని అన్నాడు. భారత సినీ చరిత్రలో ఇంతవరకూ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' వంటి చిత్రం రాలేదని చెప్పాడు. చిత్ర టీమ్ కు మద్దతుగానే షారూఖ్ మాట్లాడినా, విడుదలై 10 రోజులు కూడా కాకుండానే ఫ్లాప్ అనడం, నిర్మాతలకు మింగుడు పడటం లేదట.

More Telugu News