american currency: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.కోటికి పైగా విదేశీ కరెన్సీ స్వాధీనం

  • థాయ్‌ ఎయిర్‌లైన్స్‌లో హాంకాంగ్‌ తరలించే  ప్రయత్నంలో పట్టివేత
  • అన్నీ అమెరికా వంద డాలర్ల నోట్ల కట్టలు
  • ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

విదేశీ కరెన్సీ కట్టలను సామగ్రి అడుగున పెట్టి గుట్టు చప్పుడు కాకుండా సింగపూర్‌కు తరలించాలనుకున్న ముగ్గురు వ్యక్తుల పన్నాగాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో డీర్ఐ అధికారులు చిత్తు చేశారు. హైదరాబాద్‌ నుంచి హాంకాంగ్‌కు వెళ్లే థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ టీజీ 330 విమానంలో ఈ నగదు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు.

ముగ్గురు వ్యక్తులు హాంకాంగ్‌కు విదేశీ నగదు తరలిస్తున్నారని సమాచారం అందడంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు విమానాశ్రయంలో నిఘా పెట్టారు. ముగ్గురు వ్యక్తులు సామగ్రితో రాగా అనుమానంతో తనిఖీ చేశారు. సామగ్రి పెట్టె అడుగున అమెరికా వంద డాలర్ల నోట్ల కట్టలు కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు.

కరెన్సీపై ప్రశ్నించగా నిందితులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ నగరంలోని డీఆర్‌ఐ కార్యాలయానికి తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదు విలువ మన కరెన్సీలో కోటి 9 లక్షల 15 వేల 800 రూపాయలు అని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News