venumadhav: తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్న సినీ హాస్య నటుడు వేణుమాధవ్!

షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు వేణుమాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు తెలిపాడు. ఈరోజు ఆయన నామినేషన్ వేయబోతున్నారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణమే. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత మిమిక్రి ఆర్టిస్ట్ గా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. టీడీపీ సభల్లో మిమిక్రీ ద్వారా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత సినిమాలలో ఛాన్సులు రావడంతో... నటుడిగా బిజీ అయిపోయారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ, తన నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేయడానికే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. 
Go Back to Shorts
venumadhav
tollywood
Telangana
elections
independent
contest
kodada

More Telugu News