KCR: టీఆర్ఎస్ లోనూ రెడ్లదే ఆధిపత్యం... ఏ కులానికి ఎన్ని సీట్లంటే..!

  • ఇప్పటివరకూ 117 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
  • రెడ్డి సామాజిక వర్గానికి 37, వెలమలకు 12
  • ఓసీలకు 58, బీసీలకు 24 సీట్లిచ్చిన కేసీఆర్
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 117 నియోజకవర్గాలకు పోటీ పడే అభ్యర్థులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి, రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటివరకూ ప్రకటించిన సీట్లలో ఓసీలకు 58, బీసీలకు 24 సీట్లు దక్కగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12, సిక్కులకు ఒకటి దక్కాయి.

ఇక సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే, రెడ్లకు 37, వెలమలకు 12, మున్నూరు కాపులకు 8, గౌడలకు 6, యాదవులకు 5, మాదిగలకు 11, మాలలకు 7, లంబాడాలకు 7, కోయలకు 4, ముస్లింలకు 3, కమ్మ వర్గానికి 6, బ్రాహ్మణ, వైశ్య, ఠాకూర్, ముదిరాజ్, పద్మశాలీ, విశ్వ బ్రాహ్మణ, పెరిక, వంజర, నేతకాని, సిక్కులకు ఒక్కొక్కటి చొప్పున సీట్లిచ్చారు కేసీఆర్.
KCR
Telangana
Reddys
Velama
Assembly
Elections

More Telugu News