gslv: నింగిలోకి దూసుకుపోయిన జీఎస్ఎల్వీ మార్క్-3 డీ 2 రాకెట్

  • ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం
  • రెండో దశ విజయవంతం
  • సాఫీగా పని చేస్తున్న క్రయోజనిక్ ఇంజన్లు

ఇస్రో చేబట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రయోగం ప్రారంభమైంది. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 డీ2 వాహక నౌక ప్రయోగం ప్రారంభమైంది. ఇప్పటికి రెండో దశ విజయవంతమైంది. క్రయోజనిక్ ఇంజన్లు పనిచేయడం విజయవంతంగా ప్రారంభమయ్యాయి. సాఫీగా పని చేస్తున్నాయి. జీశాట్-29 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి వాహక నౌక ప్రవేశపెట్టనుంది. మొత్తం 3,423 కిలోల బరువున్న జీశాట్-29 ఉపగ్రహాన్ని మోసుకెళుతోంది. భారత్ నుంచి ప్రయోగిస్తున్న అత్యంత భారీ ఉపగ్రహం జీశాట్-29 పదేళ్ల పాటు సేవలందించనుంది. మారుమూల ప్రాంతాల్లో ప్రజల సమాచార అవసరాలను జీ శాట్-29 తీర్చనుంది.

More Telugu News