cpi: నాల్గో సీటు కింద దేవరకొండ వస్తుందని ఆశిస్తున్నాం: సీపీఐ నేత పల్లా

  • విచ్ఛిన్నం చేయొద్దనే మూడు సీట్లకు ఒప్పుకున్నాం
  • మా అభ్యర్థులు 18,19 తేదీల్లో నామినేషన్లు వేస్తారు
  • మాపై సీపీఎం ఆరోపణలు తగదు
తెలంగాణలో టీఆర్ఎస్ ను అధికారంలోకి రానీయకుండా చూడడానికి ఏర్పడ్డ మహాకూటమిని విచ్ఛిన్నం చేయొద్దన్న ఉద్దేశంతోనే మూడు సీట్లకు ఒప్పుకున్నామని సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సీట్ల పంపకంలో కాలయాపన జరిగిందని, నాల్గో సీటు కింద దేవరకొండ నియోజకవర్గం వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థులు 18,19 తేదీల్లో నామినేషన్లు వేస్తారని చెప్పారు. మహాకూటమిపై తమ్మినేని వ్యాఖ్యలు బాధాకరమని, అలా చేయడం తగదని అన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ వామపక్ష ఉద్యమాలు వస్తాయని వెంకట్ రెడ్డి చెప్పారు.
cpi
palla venkat reddy
devarakonda

More Telugu News