Andhra Pradesh: ఉపాధ్యాయుడు తిట్టాడని ప్రాణాలు తీసుకున్న బాలిక.. విజయవాడలో దారుణం!

  • హాజరుశాతం తక్కువగా ఉండటంతో మందలింపు
  • అవమానంగా భావించిన విద్యార్థిని మేఘన
  • చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణం 
ఉపాధ్యాయుడు మందలించాడన్న ఆవేదనతో ఓ బాలిక తీవ్ర నిర్ణయం తీసుకుంది. స్నేహితుల ముందు టీచర్ తిట్టడాన్ని తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో చోటుచేసుకుంది.

నగరంలోని సింగ్ నగర్ కు చెందిన మేఘన స్థానిక ఎంకే బేగ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో హాజరుశాతం తక్కువగా ఉండటంపై ఉపాధ్యాయుడు మేఘనను మందలించారు. దీంతో తన క్లాస్ మేట్స్ ముందు టీచర్ తిట్టడంతో మనస్తాపానికి లోనైన బాలిక ఇంటికి చేరుకుంది. ఈరోజు ఉదయం ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కాగా, మేఘనను గమనించిన  కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఉపాధ్యాయుడు అందరిముందు అవమానించడంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Vijayawada
girl suicide
low attendence
Police
hang

More Telugu News