Andhra Pradesh: చంద్రబాబుకున్న ధైర్యం గురించి దేశం మొత్తానికి తెలుసు.. దాని గురించి పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన పనిలేదు!: యనమల

  • మోదీని పవన్, జగన్ విమర్శించలేదు
  • బీజేపీని పవన్ వెనకేసుకు వస్తున్నారు
  • ‘కోడికత్తి’పై రాష్ట్రపతికెలా ఫిర్యాదు చేస్తారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ధైర్యం ఏంటో దేశం మొత్తానికి తెలుసని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అలాంటి వ్యక్తి ధైర్యం గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలను పవన్ కల్యాణ్ నుంచి నేర్చుకోవాల్సిన గత్యంతరం తమకు పట్టలేదన్నారు. జాతీయ రాజకీయాలపై తన వైఖరి ఏంటో పవన్ కల్యాణ్ వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పవన్ కల్యాణ్ లోపాయికారిగా బీజేపీని వెనకేసుకు వస్తున్నారని యనమల ఆరోపించారు. ప్రధాని మోదీని పవన్, ప్రతిపక్ష నేత జగన్ ఏనాడూ విమర్శించలేదని దుయ్యబట్టారు. జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనపై స్పందిస్తూ.. దాడి జరిగిన తర్వాత జగన్ వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదనీ, అదే సమయంలో ఆయన పార్టీ నేతలు మాత్రం రాష్ట్రపతి కోవింద్ కు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు. అసలు కోడికత్తి ఘటనపై రాష్ట్రపతికి ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు.
Andhra Pradesh
Yanamala
Chandrababu
Pawan Kalyan
Jagan
Telugudesam
Jana Sena
YSRCP
Narendra Modi
BJP

More Telugu News