kodada: కోదాడ నుంచి రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతా: టీడీపీ నాయకుడు మల్లయ్య యాదవ్

  • ఉత్తమ్ కుమార్ రెడ్డికి కులపిచ్చి ఉంది
  • కోదాడ సీటును బీసీకి ఇవ్వలేరా?
  • హుజూర్ నగర్ లో నామినేషన్ వేసే అంశాన్ని పరిశీలిస్తా
టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కులపిచ్చి ఉందని తెలంగాణ టీడీపీ నాయకుడు మల్లయ్య యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఉత్తమ్ పర్వతం లాంటి వాడైతే,  తాను ఓ చిన్న రాయి లాంటి వాడినని, రాజకీయంగా ఉత్తమ్ తనను పదిహేనేళ్లుగా అణగదొక్కారని ఆరోపించారు.

తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదని తమ నాయకత్వాన్ని ప్రశ్నించాలా? టికెట్లు అడగకుండా చేసిన ఉత్తమ్ ను ప్రశ్నించాలా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కోదాడ సీటును బీసీకి ఇవ్వలేరా? అని ప్రశ్నించిన మల్లయ్య యాదవ్, కోదాడ నుంచి రెబెల్ అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని, హుజూర్ నగర్ లో తాను నామినేషన్ వేసే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్, కోదాడలో ఆయన భార్య పద్మావతి ఓడిపోవాలని కోరుకుంటున్నానని మల్లయ్య యాదవ్ వ్యాఖ్యానించారు.
kodada
Uttam Kumar Reddy
mallaiah yadav

More Telugu News