Rakhi Sawant: నేను చచ్చిపోయినా జనం నమ్మేలా లేరు: రాఖీ సావంత్ ఏడుపు!

  • హర్యానాలో రెజ్లర్ తో పోటీ పడ్డ రాఖీ సావంత్
  • గాయంతో ఆసుపత్రిలో చేరిక
  • పబ్లిసిటీ స్టంట్ కాదని కన్నీరు
హర్యానాలోని పంచకులలో జరిగిన ఓ రెజ్లింగ్ పోటీలో, తనకు చేతకాని రెజ్లింగ్ చేసేందుకు బరిలోకి దిగి తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఇప్పుడు తీవ్ర భావోద్వేగంతో ఉంది. ఆమె పబ్లిసిటీ కోసం రెజ్లర్ ను చాలెంజ్ చేసిందని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్ చేస్తుండటంపై స్పందిస్తూ, తాను మరణించినా జనం నమ్మేలా లేరని వ్యాఖ్యానించింది.

చికిత్స అనంతరం రాఖీని వైద్యులు డిశ్చార్జ్ చేయగా, ఆమె భావోద్వేగానికి గురవుతూ, తనకు అమ్మ కావాలని, ఆమె దగ్గరకు వెళ్లాలని ఉందని చెప్పింది. తాను చేసిందేమీ పబ్లిసిటీ స్టంట్ కాదని వాపోయింది. ఇంకాస్త గట్టిగా దెబ్బ తగిలితే, తన పరిస్థితి ఏమై ఉండేదోనని కన్నీరు పెట్టుకుంది.
Rakhi Sawant
Regling
Hospital
Publicity Stunt

More Telugu News