గురజాలలో టెన్షన్.. టెన్షన్.. వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి హౌస్ అరెస్ట్!
- అర్థరాత్రి వైసీపీ కార్యకర్తల అరెస్టులు
- గురజాలలో నేడు ధర్నాకు పిలుపు
- ఇంటిపన్ను పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన
ఈ క్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు నిన్న అర్థరాత్రి నుంచే అరెస్ట్ చేయడం ప్రారంభించారు. కాగా, పోలీసుల చర్యపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నిరసన తెలపడం అన్నది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు అనీ, దాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాజాగా పన్నులు పెంచడంతో పాటు వేసిన రోడ్లకే మరోసారి టెండర్ పిలుస్తున్నారనీ, ఇదేంటని ప్రశ్నిస్తే అరెస్టులు చేయిస్తున్నారని వాపోయారు.