Telangana: 9 మందితో టీడీపీ జాబితా విడుదల.. జాబితాలో ఉన్నది వీరే..!

  • తొమ్మిది మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితా
  • పెండింగ్‌లో కూకట్‌పల్లి
  • జోరు పెంచనున్న మహాకూటమి
తెలంగాణలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు తర్వాత 65 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేయగా, టీడీపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీడీపీ ప్రకటించింది. అయితే, కూకట్‌పల్లి స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. రెండో విడత జాబితాలో కూకట్‌పల్లి అభ్యర్థిని ప్రకటించనున్నారు. నేడు టీజేఎస్ కూడా తమ జాబితాను ప్రకటించనుంది. అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్న మహాకూటమి నేతలు ఇక ప్రజల్లోకి వెళ్లి దూకుడు పెంచాలని నిర్ణయించాయి.

టీడీపీ జాబితా ఇదే..
ఖమ్మం: నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి: సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట : మచ్చ నాగేశ్వర రావు, వరంగల్ పశ్చిమ - రేవూరి ప్రకాష్ రెడ్డి, మక్తల్ - కొత్తకోట దయాకర్ రెడ్డి, మహబూబ్ నగర్ - ఎర్ర శేఖర్, ఉప్పల్ - వీరేందర్ గౌడ్, శేరిలింగంపల్లి - భవ్య ఆనంద్ ప్రసాద్, మలక్‌పేట- ముజఫర్
Telangana
Telugudesam
Elections
Candidate list
Mahakutami
Congress
TJS

More Telugu News