sushanth singh: ఉత్కంఠను రేపుతోన్న 'కేదార్ నాథ్' మూవీ ట్రైలర్

  • కేదార్ నాథ్ వరదల నేపథ్యంలో ప్రేమకథ 
  • సుశాంత్ సింగ్ జోడీగా సారా అలీఖాన్ 
  • డిసెంబర్ 7వ తేదీన విడుదల

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. సారా అలీఖాన్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో 'కేదార్ నాథ్' సినిమా రూపొందింది. 2013లో ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ క్షేత్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఆ నేపథ్యానికి ఒక ప్రేమకథను జోడిస్తూ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

సుశాంత్ సింగ్ కేదార్ నాథ్ లోని ఒక గైడ్ గా కనిపిస్తున్నాడు. ఆ క్షేత్రానికి వచ్చిన కథానాయికతో ఆయనకి పరిచయం ఏర్పడుతుంది .. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఆ ఇద్దరి ప్రేమకి ఆమె తండ్రి అడ్డుగా నిలుస్తాడు. మరొకరితో ఆమె వివాహం జరిపించడానికి ప్రయత్నిస్తాడు. ఓ రోజు రాత్రి హఠాత్తుగా వరదలు కేదార్ నాథ్ ను ముంచెత్తుతాయి. ఆ వరదల బారి నుంచి నాయికను కాపాడటానికి హీరో ప్రయత్నించడం ఈ ట్రైలర్లో చూపించారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News