tjs: రేపు టీజేఎస్ అభ్యర్థులను ప్రకటిస్తాం: ప్రొఫెసర్ కోదండరామ్

  • 8 లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయొచ్చు
  • కూటమిలోని అందరిని కలుపుకొని పోటీ చేస్తాం
  • మాపార్టీ గుర్తు ‘అగ్గిపెట్టె’పైనే పోటీ చేస్తాం

రేపు తెలంగాణ జన సమితి (టీజేఎస్) అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల్లో తాము పోటీ చేసే అవకాశముందని స్పష్టం చేశారు.

మహాకూటమిలోని అందరిని కలుపుకొని టీజేఎస్ పోటీ చేస్తుందని, సీపీఐని కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రజా, తెలంగాణ ఉద్యమాల్లో సీపీఐ కీలకపాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కామన్ గుర్తుపై కాకుండా తమ పార్టీ గుర్తు అయిన ‘అగ్గిపెట్టె’పైనే పోటీ చేస్తామని చెప్పారు. తమ పార్టీ గురించి బూత్ కమిటీలతో కలిసి విస్తృత ప్రచారం చేస్తామని చెప్పిన కోదండరామ్, ఆయన పోటీ చేసే విషయమై ఇంకా స్పష్టత లేదని అన్నారు.

  • Loading...

More Telugu News