chatisgarh: ఛత్తీస్ గఢ్ లోని పది నియోజకవర్గాల్లో ముగిసిన తొలిదశ పోలింగ్

  • మావోల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తి
  • మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసిన పోలింగ్
  • మధ్యాహ్నం 1.30 గంటల వరకు 33.86 శాతం పోలింగ్ నమోదు

ఛత్తీస్ గఢ్ లోని పది నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ పది నియోజకవర్గాల్లో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్ ముగిసింది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల వరకు 33.86 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఛత్తీస్ గఢ్ లోని 8 జిల్లాల్లో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. నేడు బీజాపూర్‌, నారాయణ్‌పూర్‌, కాంకేర్‌, బస్తార్‌, సుక్మా, రాజనందగావ్‌, దంతెవాడ జిల్లాలోని 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.  

More Telugu News