Students: నక్సల్స్ నుంచి రక్షణ కోసం.. ఆయుధాలు చేబట్టి బడికి వెళుతున్న విద్యార్థులు!

  • జార్ఖండ్ లో విల్లంబులు చేబట్టి బడికి వెళుతున్న విద్యార్థులు
  • నక్సల్స్ నుంచి కాపాడుకునేందుకు చేతిలో ఆయుధాలు
  • వారి దీనస్థితిని వెలుగులోకి తెచ్చిన వార్తాసంస్థ 'ఏఎన్ఐ'

బడికి వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారులు, తమ రక్షణ నిమిత్తం విల్లంబులు పట్టుకోవాల్సిన పరిస్థితి. స్కూలుకు వెళ్లేందుకు అడవిని దాటే చిన్నారులు, మార్గమధ్యంలో ఉండే నక్సల్స్ నుంచి రక్షణ కోసం విల్లంబులు పట్టుకుని వెళుతుండగా, ఈ పరిస్థితిని చూసిన వార్తాసంస్థ 'ఏఎన్ఐ' ఈ చిత్రాలను బయటి ప్రపంచానికి చూపించింది.

జార్ఖండ్‌ రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉండే చకులియాస్‌ పోచపాని గ్రామం విద్యార్థులు ఇలా విల్లంబులు, పుస్తకాల సంచీ చేతబట్టుకుని నిత్యమూ అటవీ ప్రాంతంలో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తుంటారని తెలిపింది. చదువును మధ్యలో ఆపకూడదన్న సంకల్పం వీరినిలా నడిపిస్తోందని పేర్కొంది. ఇక్కడ చదువుకోవాలన్నా, ప్రాణాలు నిలుపుకోవాలన్నా ఆయుధాలు చేతిలో ఉండటం తప్పనిసరని చెబుతూ, విద్యార్థుల దీనస్థితి గురించి పేర్కొంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.




More Telugu News