Ayodhya: అయోధ్యపై ఇంత తొందరేల?: సుప్రీంకోర్టు

  • జనవరిలో విచారిస్తామని చెప్పాం కదా?
  • ముందస్తు విచారణ ఇక ఎందుకు?
  • పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు

రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై వెంటనే విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ ను కొద్దిసేపటిక్రితం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును జనవరికి వాయిదా వేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ కే కౌల్ ధర్మాసనం, అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.

ఇప్పటికే కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసిన ధర్మాసనం, అప్పీళ్లన్నింటినీ జనవరిలోనే పరిశీలిస్తున్నామని, ముందస్తు విచారణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. ఈ పిటిషన్ ను అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసి, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈలోగానే కేసును విచారించాలని వాదించారు.

More Telugu News