ileana: మీటూపై ఇలియానా స్పందన!

  • మీటూపై ఇప్పటికిప్పుడు స్పందించను
  • సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తా
  • వేధింపులను బయటపెడితేనే.. సమస్యలు తీరుతాయి
సినీ, రాజకీయ, వ్యాపార రంగాలను మీటూ ఉద్యమం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని మీటూ ఉద్యమం ద్వారా బయటపెడుతున్నారు. బాధిత మహిళల్లో వచ్చిన ఈ మార్పుతో... ఎంతో మంది ప్రముఖుల జీవితాలు తలకిందులవుతున్నాయి. మీటూపై తాజాగా గోవా బ్యూటీ ఇలియానా స్పందించింది. మీటూపై ఇప్పటికిప్పుడు తాను స్పందించనని... కానీ, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా స్పందిస్తానని చెప్పింది.

లైంగిక వేధింపులకు గురైన మహిళ కానీ, పురుషుడు కానీ... ధైర్యంగా ముందుకు వచ్చి వేధింపుల గురించి చెప్పడం సంతోషకర అంశమని ఇల్లీ తెలిపింది. ఇవన్నీ భయానక అనుభవాలని... ఎవరో ఒకరు ముందుకు వచ్చి తమ అనుభవాలను చెబితేనే, సమస్యలు తీరుతాయని చెప్పింది. లేకపోతే... ఈ వేధింపులు ఇలాగే కొనసాగుతాయని తెలిపింది. సరైన సమయంలో తాను కూడా స్పందిస్తానని చెప్పింది. 
ileana
ileana dcruz
tollywood
bollywood
metoo

More Telugu News