t-elections: తెలంగాణ ఎన్నికలు.. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ

  • ఈ నెల 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు
  • 13 నియోజకవర్గాలు సమస్యాత్మకంగా గుర్తింపు
  • ఆ ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 వరకు  నామినేషన్ల ఉపసంహరణకు గడువు. కాగా, రాష్ట్రంలోని 13 నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా ఎన్నికల అధికారులు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.


 
t-elections
nominations
election commission

More Telugu News