Sabarimala: ఏపీ ఆర్టీసీ బస్సుల్లో శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త!

  • నీలక్కల్ లో స్థలం కేటాయింపు
  • ఫలించిన ఏపీఎస్ఆర్టీసీ అధికారుల చర్చలు
  • కనీసం 50 బస్సులను నిలిపే అవకాశం

పంబా నదికి సమీపంలోని నీలక్కల్ లో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల పార్కింగ్ నకు, డ్రైవర్లు సిబ్బంది విశ్రమించేందుకు గది, విచారణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ, కేరళ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. స్వామి దర్శనం తరువాత దిగివచ్చే భక్తులు తమ బస్సు ఎక్కడుందో తెలియక, డ్రైవర్ అందుబాటులో లేక పడే ఇబ్బందులు ఇకపై తీరనున్నాయి.

గడచిన నాలుగు రోజులుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు కేరళ అధికారులతో చర్చలు సాగించారు. కనీసం 50 బస్సులను నిలిపి ఉంచేందుకు స్థలం కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేరళ సర్కారు, అందుకు అనుమతిస్తూ స్థలాన్ని కేటాయించింది. కాగా, ఇప్పటికే చిత్తూరు డిపోకు చెందిన 54 బస్సులను అయ్యప్ప భక్తులు బుక్ చేసుకున్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News