New Delhi: మందు కొట్టి కారు నడిపిన అమ్మాయి... యాక్సిడెంట్ లో మరో యువతి మృతి!

  • న్యూఢిల్లీలోని పంజాబీ బాగ్ లో ఘటన
  • డివైడర్ ను దాటి, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన యువతి వాహనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
పూటుగా మద్యం తాగిన ఓ అమ్మాయి నడిపిన వాహనం అదుపుతప్పగా, మరో వాహనంలో వెళుతున్న ఓ యువతి దుర్మరణం పాలైంది. న్యూఢిల్లీ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పంజాబీ బాగ్ ప్రాంతంలో శివానీ (22) అనే యువతి తన మారుతీ సుజుకి ఎస్ క్రాస్ వాహనంలో వస్తోంది.

ఆమె పూర్తిగా మద్యం మత్తులో ఉండటంతో కారు అదుపుతప్పి, డివైడర్ ను దాటి, ఎదురుగా వస్తున్న మహీంద్ర క్వాంటో కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారుతో తన కుటుంబ సభ్యులతో కలసి పూనమ్ సర్దాన్ అనే యువతి ప్రయాణిస్తోంది. పూనమ్ వాహనాన్ని నడుపుతూ ఉండటం, ఆమె కూర్చున్న వైపే కారు ఢీకొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే ఆమె మరణించింది. శివానీ మద్యం తాగి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
New Delhi
Crime News
Car Accident
Road Accident
Police

More Telugu News