Chandrababu: ఏపీ పోలీసులపై నమ్మకం లేదా? అన్న టీడీపీ నేతల ప్రశ్నలకు దీటైన సమాధానం చెప్పిన వైఎస్ విజయమ్మ!

  • చంద్రబాబుకు కేంద్ర బలగాల రక్షణ ఎందుకు?
  • సొంత పోలీసులపై నమ్మకం లేదా?
  • విజయమ్మ సూటి ప్రశ్న

ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే, దాడి కేసులో విచారణకు సహకరించడం లేదని అంటున్న వైఎస్ జగన్, ఏపీ పోలీసుల రక్షణ లేకుండానే ఇన్నాళ్లు పాదయాత్ర చేశారా? అని తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై వైఎస్ విజయమ్మ ఘాటుగా స్పందించారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, "చంద్రబాబునాయుడు గారికి, ముఖ్యమంత్రి కాకముందు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జడ్ ప్లస్ కేటగిరీని కేంద్రం రక్షణగా ఇచ్చింది. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలను రక్షణగా పెట్టుకున్నారు? ఏం రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదా? ఎందుకు పెట్టుకుని ఉన్నాడు? ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. అయితే, ప్రభుత్వంపైనే నమ్మకం లేదు. రోజుకో అబద్ధం సృష్టిస్తున్నందునే ప్రభుత్వంపై నమ్మకం లేదు" అని ఆమె అన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం ఉంటే, చంద్రబాబుకు కేంద్ర బలగాల రక్షణ ఎందుకని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News