చిన్న కత్తేగా?... గాయం ఎంత వెడల్పు, లోతు అని అడుగుతారా?: నిప్పులు చెరిగిన విజయమ్మ
- ఏడాదిగా ప్రజల్లోనే జగన్
- హత్యాయత్నంపై ప్రభుత్వ తీరు గర్హనీయం
- ఘటన వెనకున్న వారి పేర్లు రానీయలేదు
- వైఎస్ విజయమ్మ ఆరోపణలు
"నేడు అడుగుతున్నా. ఎయిర్ పోర్టులో, వీఐపీ లాంజ్ లో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ సెక్యూరిటీ? అని నేను అడుగుతున్నా. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ లేకపోతే, ఈ ప్రభుత్వం ఇంక ఎవరికి సెక్యూరిటీ ఇస్తుందని అడుగుతున్నా. ఈరోజు ఎయిర్ పోర్టులోకి గుండుసూది కూడా పోలేదు. నెయిల్ కట్టర్లు, చిన్న కత్తెరలు ఉన్నా తీసేస్తారు. అటువంటిది ఏ విధంగా కత్తి వెళ్లింది. ఎవరు సహాయం చేశారు? ఎవరి ప్రోద్బలంతో కత్తి వెళ్లింది? దాని గురించి ఎంక్వయిరీ లేనే లేదు" అని విజయమ్మ వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు రావడం ఏంటని ప్రశ్నించారు. విచారించకుండానే అలా ఎలా మాట్లాడారని అడిగారు.