Raghu Ram Rajan: నోట్ల రద్దు, జీఎస్‌టీతో దేశాభివృద్ధి దారుణంగా దెబ్బతింది: రఘురామ్ రాజన్ సంచలన వ్యాఖ్యలు

  • నోట్ల రద్దు దేశానికి చాలా పెద్ద దెబ్బ
  • దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది
  • దేశం చాలా వెనక్కి వెళ్లింది

పెద్ద నోట్ల రద్దును తొలి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వద్ద దేశాభివృద్ధి కుంటుపడిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఈ రెండు స్తంభింపజేశాయన్నారు. బెర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతోందని, దేశ అవసరాలకు ఇది ఎంతమాత్రమూ సరిపోదని రాజన్ వివరించారు.

ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా 2017లో పుంజుకున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం చతికిలపడిందని రాజన్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశానికి చాలా పెద్ద దెబ్బ తగిలిందన్నారు. ఈ రెండింటి వల్ల దేశం చాలా వెనక్కి వెళ్లిందని పేర్కొన్నారు. 2012-2016 మధ్య దేశం రెండు భారీ దెబ్బలను తట్టుకుని మరీ వేగంగా వృద్ది చెందిందని రాజన్ పేర్కొన్నారు.

More Telugu News