నేనెవరో తెలుసా?... తెల్లారేసరికి ట్రాన్స్ ఫరే: కొత్తగూడెం పోలీసులకు బెదిరింపులు!
- కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ లో వీరంగం
- కౌన్సిలర్ కుమారుడు సహా నలుగురు అరెస్ట్
- కేసు నమోదు చేసిన పోలీసులు
సెంటర్ లో తమ కారును ఆపి గొడవ చేస్తుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ నరేష్ వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని నరేష్ కోరగా, ఎదురు తిరిగిన పృథ్వీరాజ్, "నేను ఎవరో తెలుసా? తెల్లారేసరికి నిన్ను ట్రాన్స్‌ఫర్ చేయిస్తాం" అంటూ దుర్భాషలాడారు. దీంతో ఆ నలుగురినీ, అరెస్ట్ చేయబోగా, అప్పుడూ రెచ్చిపోయారు. బలవంతంగా వారిని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు.