Jaya Prada: అరుంధతి, బాహుబలి తరువాత ఇదే: జయప్రద

  • జయప్రద నటించిన తాజా చిత్రం 'శరభ'
  • సూపర్ హిట్ చిత్రం అవుతుంది
  • హైదరాబాద్ లో మీడియాతో జయప్రద
తెలుగు వెండితెరపై సూపర్ హిట్ గా నిలిచిన అరుంధతి, బాహుబలి చిత్రాల తరువాత, కొత్తగా రానున్న 'శరభ' ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం తనకుందని సీనియర్ నటి జయప్రద వ్యాఖ్యానించారు. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి హీరో, హీరోయిన్లుగా, జయప్రద ముఖ్య పాత్రలో నటించిన 'శరభ' రూపొందగా, ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జయప్రద, తాను తెలిసీతెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చానని, తెలుగు పరిశ్రమ తనకు గుర్తింపు తెచ్చి పెట్టిందని అన్నారు. టాలీవుడ్ రుణాన్ని తాను ఎన్నడూ తీర్చుకోలేనని చెప్పారు.

తెలుగు ఇండస్ట్రీకి ఒక హీరోను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆకాశ్‌ ను నిర్మాత తీసుకొచ్చారని, పాటలు, ఫైట్స్‌ లాంటివి తెలియని ఆకాశ్‌ తో 'శరభ' వంటి భారీ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. అరుంధతి, బాహుబలి తరువాత ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ సినిమాను ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తనకుందని చెప్పారు.
Jaya Prada
Sarabha
Tollywood
movie

More Telugu News